TTD : శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

Update: 2024-04-26 04:53 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 3 గంటలు పడుతోంది. . శుక్రవారం కావడంతో పాటు పరీక్ష ఫలితాలు విడుదల కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి ఎక్కువ సమయమే పడుతుంది. వసతి గృహాలు దొరకడం కూడా కొంత కష్టంగానే ఉంది. వసతి గృహాల కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. నిన్న శ్రీవారిని 61,492 మంది భక్తులు దర్శించుకోగా.. 27,660 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.72 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి 23వ తేదీ వరకు పరిశీలిస్తే దాదాపు 16,51,341 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి 23వ తేదీ వరకు 15 లక్షల మంది భక్తులే శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేకించి వేసవి సెలవుల్లో శ్రీవారిని సగటున రోజుకు 70 నుంచి 80 వేల మంది దర్శించుకుంటారు. వారాంతాల్లో అయితే 90 వేల వరకు ఆ సంఖ్య పెరుగుతుంది. కానీ పదిరోజులుగా సగటున 60 వేలమంది మాత్రమే దర్శించుకున్నారు.

Tags:    

Similar News