Tirumala : సాధారణంగా తిరుమలలో భక్తుల రద్దీ

Update: 2024-04-03 04:57 GMT

తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 56,228 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు సమకూరింది.

మరోవైపు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 9న శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని టీటీడీ (TTD) శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, ఈవో ధ‌ర్మారెడ్డి క‌లిసి పాల్గొన్నారు.

శ్రీవారి సన్నిధిలోని ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు, స్వామి వారి ఆలయం లోపల ఉన్న ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, ఆలయ పైకప్పు, స్వామివారి పూజా సామగ్రి... అన్నింటిని జల సంప్రోక్షణ చేశారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సమయంలో వెంకటేశ్వరస్వామి వారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు.

Tags:    

Similar News