తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆదివారం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. వీరికి శ్రీవారి దర్శనం అయ్యేందుకు 20 గంటలు పట్టినట్లు టీటీడీ వెల్లడించింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు 5 కంపార్టుమెంట్లల్లో వేచి ఉన్నారు. వీరిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-01 కంపార్టుమెంట్ల నుంచి దర్శనానికి పంపుతుండగా.. 3 గంటల సమయం పడుతోంది. కాగా శనివారం శ్రీవారిని 78,686 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.3.54కోట్లు లభించింది.
ప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామిని దర్శించుకుని రంగనాయక మండపానికి చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణకు వేదపండితులు ఆశీర్వచనం, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన అఖిలాండం వద్దకు చేరుకుని బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.