Yadadri : యాదాద్రికి రికార్డ్ స్థాయి ఆదాయం

Update: 2024-05-29 05:36 GMT

తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్ట హుండీ ఆదాయం రికార్డులు సృష్టించింది. నెలరోజుల ఆదాయాన్ని లెక్కించగా దాదాపు నాలుగు కోట్ల రూపాయలకుపైగా ఆదాయం లభించింది. కొండకింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో హుండీని లెక్కించారు.

నగదు 3కోట్ల 93 లక్షల 88వేలు, బంగారం 174 గ్రాములు, వెండి ఏడు కిలోలు ఖజానాకు సమకూరిందని ఈవో భాస్కర్‌ రావు తెలిపారు. అలాగే వివిధ దేశాలకు చెందిన కరెన్సీ కూడా వచ్చిందని తెలిపారు. అత్యధికంగా అమెరికా డాలర్లు భక్తులు స్వామికి సమర్పించినట్లు తెలిపారు.

మరోవైపు.. యాదాద్రిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Tags:    

Similar News