తిరుమలలో ఇవాళ సా.4 గంటలకు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం కానుంది. తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై ఇందులో తీర్మానించనున్నట్లు సమాచారం. సాయంత్రానికి చెక్కులు తయారు చేసి, రేపు ఉదయానికల్లా ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం మృతుల గ్రామాలకే వెళ్లి వాటిని అందజేసే అంశంపైనా చర్చించనున్నారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు మిగిలిన 7 రోజులకు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీపై ఈ భేటీలో చర్చించి నిర్ణయం ప్రకటించనున్నారు.