కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమలకు రానున్నారు. ఈరోజు రాత్రి 7 గంటల 20 నిమిషాలకు తిరుమలకు అమిత్ షా చేరుకోనున్నారు. తిరుమలలోని వకుళమాత అతిథి గృహానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం 8 గంటల 25 నిమిషాలకు తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకుంటారు.
అమిత్ షా పర్యటన సందర్భంగా తిరుమల తిరుపతిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు. ఎన్నికల ఫలితాలకు ముందు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది.
కాగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.