Chiranjeevi Wishes : మినిస్టర్ లోకేశ్ కు చిరు బర్త్ డే విష్.. అభిమానుల ఆకాంక్ష అవే!
ఏపీ మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లోకేశ్‌కు మెగాస్టార్ చిరంజీవి 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా బర్త్‌డే విషెస్ తెలిపారు. "ప్రియమైన లోకేశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, అభిరుచితో ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా పాటుపడటం హర్షణీయం. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ ఏడాది మీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను" అని చిరు ట్వీట్ చేశారు.
టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు లోకేశ్ చాలా గ్రౌండ్ వర్క్ చేశారని.. ఆయన మరో ఉన్నత పదవికి అర్హుడని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. డిప్యూటీ సీఎం పోస్టుతో లోకేశ్ చంద్రబాబు త్వరలోనే గౌరవించాలని కోరారు. ఐతే.. ఇటీవలే డిప్యూటీ సీఎం డిమాండ్లపై పెద్దఎత్తున చర్చ జరిగింది. లోకేశ్ తోసిపుచ్చారు. పార్టీ అగ్ర నాయత్వం కూడా ఇలాంటి డిమాండ్లు చేయొద్దని సూచించడం విశేషం.