తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం కేఆర్ఎంబీ నీటివిడుదల ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు నీటి విడుదలకు ఉత్తర్వులు శ్రీశైలం నుంచి పవర్ హౌసెస్ ద్వారానే నీరు విడుదల చేయాలని కేఆర్ఎంబీ పేర్కొంది. రేపటి నుంచి నీటి విడుదలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి ఇవ్వనుంది. తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించాలని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది.
తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో అందుబాటులో ఉన్న నీటి కేటాయింపు కోసం ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశం ఈ నెల 5న జరిగింది, ఇందులో తెలంగాణ తన వాదన వినిపించగా, ఆంధ్రప్రదేశ్ హాజరు కాలేదు. తెలంగాణ రాష్ట్రానికి 10.26 టీఎంసీల నీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 టీఎంసీల నీరు అవసరంకాగా, తెలంగాణ జాతీయ కాంగ్రెస్ మే 6న రాసిన లేఖ ప్రకారం, 2025 మే 5 నాటికి నీటి లభ్యత 10.81 టీఎంసీలుగా ఉంది. నీటి కొరత నేపథ్యంలో అందుబాటులో ఉన్న నిల్వను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. శ్రీశైలం నాగార్జునసాగర్ నుండి కేటాయింపు కోసం మొత్తం నీటి లభ్యత ఆంధ్రప్రదేశ్ కు 4 టీఎంసీలు, తెలంగాణకు 10.26 టీఎంసీలను కేటాయించింది.