ఏపీ టెన్త్ పరీక్షల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 55,966 మంది దరఖాస్తు చేసుకోగా, 43,714 మంది ఆన్సర్ షీట్ల రిజల్ట్స్‌ను రిలీజ్ చేసింది.దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు వెబ్‌సైట్‌లో స్కూల్స్ లాగిన్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈ అవకాశం మే 30 వరకు ఉంటుంది. మిగతా విద్యార్థుల ఫలితాలను త్వరలో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. పాఠశాలల హెడ్‌మాస్టర్ల లాగిన్ నుంచి ఫలితాల కాపీలను పొందవచ్చన్నారు.
ఏపీలో 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2024 పరీక్షలు మే 24వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. AP SSC Supplementary Hall Tickets డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
పరీక్షల టైం టేబుల్ :
మే 24, 2024: ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్-1
మే 25, 2024: సెకండ్ ల్యాంగ్వేజ్
మే 27, 2024: ఇంగ్లిష్
మే 28, 2024: మ్యాథమెటిక్స్
మే 29, 2024: ఫిజికల్ సైన్స్
మే 30, 2024: జీవ శాస్త్రం
మే 31, 2024: సోషల్ స్టడీస్
జూన్ 1, 2024: ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ II, OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ I
జూన్ 3, 2024: OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ II, SSC ఒకేషనల్ కోర్సు