గత నెలలో ఢిల్లీ వస్తున్న నటి కంగనా రనౌత్‌ను ( Kangana Ranaut ) చండీగఢ్ ఎయిర్‌పోర్టులో CISF మహిళా జవాను కుల్విందర్ కౌర్ ( Kangana Ranaut ) చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో సదరు జవానును CISF విధుల నుంచి తప్పించింది. తాజాగా ఆమెను బెంగళూరులోని రిజర్వు బెటాలియన్‌కు సంస్థ బదిలీ చేసింది. అయితే ఆమెపై సస్పెన్షన్ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ జూన్ 6న చంఢీగఢ్ ఎయిర్ పోర్టులో కంగనను చెంపదెబ్బ కొట్టారు. దీంతో సీఐఎస్ఎఫ్ కుల్వీందర్ ను సస్పెండ్ చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదయింది. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఈ కమిషన్ రిపోర్టు సమర్పిం చడానికి మరికొంత సమయం పడుతుంది. ఈ క్రమంలోనే ఆమెను బెంగళూరులోని టెన్త్ రిజర్వ్ బెటాలియన్‌కు ట్రాన్స్ ఫర్ చేశారు.