మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా పటోలే ( Nana Patole ) కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఇందుకు సంబం ధిం చిన వీడియో సామా జిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కారు లో కూర్చున్న పటోలే కాళ్లను పార్టీ కార్యకర ఒకరు కడుగుతు న్నట్లు అందులో కనిపించింది. సదరు కార్యకర్తను నిలువరించే ప్రయత్నం కూడా చేయకపోవడం విమర్శలకు దారి తీసింది. అకోలా జిల్లాలో ఉన్న పటోలే. వర్షంలో పర్యటించారని, ఆయన కాళ్లకు బురద అంటడంతో, కార్యకర్త ఒకరు కడిగే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. నాకాళ్లకు బురద అంటింది. కడుక్కోవడానికి నీళ్లు అడిగాను, అతడు కాళ్లపై నీళ్లు పోశాడు. నేనే కాళ్లు కడుకున్నాను. ఈ ఘటనను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అని విలేకరుల సమావేశంలో పటోలే వెల్లడించారు. కానీ బీజేపీ మాత్రం ఈ వీడియోను వైరల్ చేస్తూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించింది.
కాంగ్రెస్ "నవాబీ", "ఫ్యూడల్" మనస్తత్వం గురించి షెహజాద్ పూనావాలా ఎక్స్లో పోస్టు చేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటోలే ఒక పార్టీ కార్యకర్త చేతకాళ్ళు కడిగించుకున్నారు. వారు ఓటర్లను, కార్మికులను గులాం (బానిసలు) లాగా చూస్తారు. తమను తాము రాజులు, రాణు లుగా భావిస్తున్నారు.
అలాంటి వారు పొరపాటున అధికారంలోకి వస్తే ఏంచేస్తారో ఊహించండి? నానా పటోలే క్షమాపణలు చెప్పాలి అని పూనావాలా డిమాండ్ చేశారు.