Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్లు అతిపెద్ద అవినీతి కుంభకోణం : రాహుల్ గాంధీ

Update: 2024-03-11 09:17 GMT

ఎలక్టోరల్ బాండ్లు (Electoral Bonds) దేశంలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణంగా రుజువు కాబోతున్నాయని కాంగ్రెస్ (COngress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ‘బాండ్ల చిట్టా బయటపడితే మోదీ ప్రభుత్వం, కంపెనీల అవినీతి మొత్తం బహిర్గతమవుతుంది. డొనేట్ చేసి ఏమైనా చేసుకోండి అనేలా ఉంది ప్రధాని మోదీ డొనేషన్ బిజినెస్. నల్లధనాన్ని 100రోజుల్లో వెనక్కి తెస్తానన్న ఆయన.. తన బ్యాంక్ అకౌంట్లు చూపించేందుకు సుప్రీం ముందు ముఖం చాటేస్తున్నారు’ అని విమర్శించారు.

మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలు రేపటిలోగా సమర్పించాలని ఆదేశించింది. జూన్ 30 వరకు గడువు కావాలని SBI దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. 26 రోజులుగా ఏం చేశారని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహించింది. మార్చి 15 సాయంత్రం 5గంటల్లో ఈసీ తన దగ్గరున్న వివరాలను అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.

Tags:    

Similar News