బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత సైన్యం అసోంలో దాదాపు 5 వేల చెట్లను నాటినట్లు అధికారులు తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు అసోంలోని సోనిత్ పూర్ జిల్లాలో భారత సైన్యంలోని ఎకోలాజికల్ టాస్క్ ఫోర్స్ యూనిట్ ఈ కార్యక్రమం నిర్వహించింది.
ఎకోలాజికల్ టాస్క్ ఫోర్స్ అనేది టెరిటోరియల్ ఆర్మీ కింద వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, జాతీయ, ప్రాంతీయ అత్యవసర పరిస్థితుల్లో భారత సాయుధ దళాలు, పౌర అధికారులకు
కార్యాచరణతో పాటు రవాణా మద్దతును అందించే సైనిక రిజర్వ్ ఫోర్స్.
అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలో 2007లో ఎకోలాజికల్ టాస్క్ ఫోర్స్ స్థాపించారు. మొదటినుంచి ఈ సంస్థ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్రను పోషించింది.