ఆంధ్రప్రభ ఏపీ పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న జఠిల సమస్యలపై కేంద్రం దృష్టి సారించింది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దృష్టి కేంద్రీకరించింది. ఈనెల 24న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. ప్రత్యేకించి షెడ్యూల్ 13లోని అంశాలపై 24న సమావేశంలో చర్చించనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టారు.