ఈ నెల 24 నుంచి వచ్చే నెల 3 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త ఎంపీలతో ఈ నెల 24, 25 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు వివరించారు. 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇక 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తారు. ఎన్డీయే 3.0కి ఇది తొలి సెషన్ కావడం గమనార్హం. రాజ్యసభ 264వ సమావేశాలు కూడా జూన్ 27న ప్రారంభమై జూలై 3న ముగుస్తాయని, జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ ( Narendra Modi ) తన మంత్రి మండలిని పార్లమెంటుకు పరిచయం చేస్తారని కిరెన్ రిజిజు పేర్కొన్నారు.
మరోవైపు ఈ నెల 21 నుంచి కొత్త అసెంబ్లీ సమావేశాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. సీఎం చంద్రబాబు ( CM Chandrababu Naidu ) తర్వాత సభలో సీనియర్ ఎమ్మెల్యే అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ రేపు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాతి రోజు ఎమ్మెల్యేలతో గోరంట్ల ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక 22న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తారు. తిరిగి జులైలో బడ్జెట్ నిమిత్తం సభ సమావేశమవుతుంది.