Rahul Gandhi : రాహుల్ ఇంటి వద్ద భద్రత పెంపు

Update: 2024-07-05 06:45 GMT

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) నివాసం వద్ద ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచారు. స్థానిక పోలీసులతో పాటు ఒక ప్లాటూన్ పారామిలిటరీ బలగాలను ఆయన నివాసం చుట్టూ మోహరించారు. మితవాద గ్రూపు దాడి చేయవచ్చన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ చర్యలు చేపట్టారు.

లోక్ సభలో సోమవారం ప్రసంగించిన రాహుల్ గాంధీ.. హిందూత్వ వాదులు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ పార్టీ శ్రేణులు రాహుల్ నివాసం వద్ద ఆందోళనకు దిగే ప్రమాదం ఉందని భద్రతను పెంచారు. ఆయన నివాసం చుట్టూ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులకు సూచించారు.

జెడ్ ప్లస్ భద్రత కలిగిన రాహుల్ కు సీఆర్పీఎఫ్ బృందాలు భద్రత కల్పిస్తున్నాయి. బీజేపీని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు బుధవారం ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Tags:    

Similar News