Chandrababu Naidu : ఆసియా కప్ ఫైనల్‌లో తిలక్ వర్మ మెరుపులు: అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు...

Update: 2025-09-29 10:13 GMT

దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని సాధించి, తమ 9వ ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఉత్కంఠ పోరులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ... బౌండరీలు, సిక్సర్లు బాదుతూ..ఉత్కంఠ పోరులో భారత జట్టుకు విజయాన్ని అందించాడు తిలక్. అతని పోరాట పటిమకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.

క్రికెట్ అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు తిలక్ వర్మ ను అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం తన సోషల్ మీడియా ఖాతాలో తిలక్ వర్మ గురించి పోస్ట్ చేసారు. "కుర్రాడు తిలక్ వర్మ తన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో పిచ్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. భారత్‌ను విజయపథంలో నడిపించాడు! ఒత్తిడిలోనూ అతని ప్రశాంతత, ప్రతిభ స్ఫూర్తిదాయకం. ఈ ఆటతీరు చాలా బాగుంది తిలక్.. మేము నిన్ను చూసి గర్విస్తున్నాము**," అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసుకొచ్చారు.

Tags:    

Similar News