ASIA CUP: నేడు శ్రీలంకతో భారత్ ఢీ

ప్రయోగాలతో బరిలోకి టీమిండియా

Update: 2025-09-26 06:30 GMT

ఆసియాకప్ లో జో­రు­మీ­దు­న్న టీ­మ్‌­ఇం­డి­యా మరో పో­రు­కు సి­ద్ధ­మైం­ది. నా­మ­మా­త్ర­మైన ఆఖరి సూ­ప­ర్‌-4 మ్యా­చ్‌­లో శు­క్ర­వా­రం శ్రీ­లం­క­ను ఢీ­కొం­టుం­ది. సూ­ర్య సేన నేడు చి­వ­రి సూ­ప­ర్-4 మ్యా­చ్‌­లో శ్రీ­లం­క­తో ఆడ­నుం­ది. ఫై­న­ల్‌­కు ముం­దు ఈ మ్యా­చ్‌­ను భా­ర­త్‌­కు సన్నా­హ­కం­గా ఉప­యో­గ­ప­డ­నుం­ది. అభి­షే­క్ శర్మ భీకర ఫా­మ్‌­లో ఉం­డ­టం టీ­మిం­డి­యా­కు ప్ర­ధాన బలం. గి­ల్‌ కూడా టచ్‌­లో­నే ఉన్నా­డు. పాం­డ్యా కూడా గత మ్యా­చ్‌­లో వి­న్నిం­గ్ ఇన్నిం­గ్స్ ఆడా­డు. ఇక, సూ­ర్య, తి­ల­క్, దూబె, శాం­స­న్ ఫై­న­ల్‌­కు ముం­దు ఆత్మ­వి­శ్వా­సా­న్ని కూ­డ­గ­ట్టు­కో­వా­ల్సిన అవ­స­రం ఉంది. బ్యా­టిం­గ్‌ ఆర్డ­ర్లో సంజు శాం­స­న్‌ స్థా­నా­న్ని ఖరా­రు చే­య­డం భా­ర­త్‌­కు ఇబ్బం­ది­గా మా­రిం­ది. బం­గ్లా­తో మ్యా­చ్‌­లో శాం­స­న్‌ టా­ప్‌-7లో ఆడిం­చ­లే­క­పో­యా­రు. అక్ష­ర్‌ పటే­ల్‌ కంటే ముం­దు సం­జు­ను పం­ప­లే­క­పో­తే జట్టు­లో ఉండి ఏం లాభం అన్న ప్ర­శ్న­లు తలె­త్తు­తు­న్నా­యి. 

ఫీల్డింగ్ వైఫల్యం జట్టును కష్టాల్లోకి నెడుతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‌ల్లో పలు క్యాచ్‌లు నేలపాలయ్యాయి. ఫీల్డింగ్ తప్పిదాలు ప్రత్యర్థులకు అవకాశాలుగా మారతాయి. కాబట్టి, ఫీల్డింగ్‌లో లోపాలను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా చూసుకున్న ఈ మ్యాచ్‌లో టీమిండియానే స్పష్టమైన ఫేవరెట్. హెడ్ టూ హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. టీ20ల్లో ఇరు జట్లు 31 సార్లు ఎదురుపడితే భారత్ 21 విజయాలతో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. శ్రీలంక 9 మ్యాచ్‌ల్లోనే నెగ్గింది. గ్రూపు దశలో మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన శ్రీలంక సూపర్-4లో మాత్రం దారుణంగా నిరాశపర్చింది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఎలిమినేట్ అయ్యింది. మరి, భారత్‌కు ఎంత వరకు పోటీ ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News