భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ మరో హిస్టరీ క్రియేట్ చేసింది. ఉజ్బెకిస్తాన్లో జరుగుతున్న ఆసియా జిమ్నాస్టిక్స్ చాంపియన్ షిప్లో దీపా స్వర్ణ పతకం గెలుచుకుంది. దాంతో ఆసియా జిమ్నాస్టిక్స్ చరిత్రలో బంగారు పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్ గా దీపా కర్మాకర్ రికార్డుల్లోకెక్కింది.
ఆదివారం జరిగిన మహిళల వాల్ట్ ఈవెంట్ ఫైనల్లో దీపా కర్మాకర్ 13,566 స్కోరుతో విజేతగా నిలిచి పసిడిని సొంతం చేసుకుంది. మరోవైపు కొరియాకు చెందిన కిమ్ సన్ హ్యాంగ్ (13.466) రజతం గెలుచుకుంది. జో యోంగ్ బైయోల్ (12.966)తో కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
గతంలో ఈ టోర్నీలో భారత అథ్లెట్లు నాలుగు కంస్య పతకాలు గెలుచుకున్నారు. దీపా కర్మాకర్ కు సోషల్ మీడియాలో ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.