Asia Cup Tournament : బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

Update: 2025-09-25 07:59 GMT

ఆసియా కప్ టోర్నీలో భారత్ ఫైనల్ లో ప్రవేశించింది. సూపర్ -4లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 41పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 75, హార్థిక్ పాండ్యా 38, శుభ్ మన్ గిల్ 29 పరుగులతో ఆకట్టుకున్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషాద్ హుస్సేన్ 2, ముస్తాఫిజుర్, హసన్ షకిబ్ , సైఫుద్దీన్.......ఒక్కో వికెట్ తీశారు. 169పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్..... 19.3 ఓవర్లకు 127 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్లలో.. సైఫ్ హసన్ 69పరుగులతో రాణించగా..... పర్వేజ్ 21 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.....చెరో 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, తిలక్ వర్మ.... ఒక్కో వికెట్ తీశారు. పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య ఇవాళ జరిగే నాకౌట్ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుతో... ఈనెల 28న జరిగే ఫైనల్ పోరులో భారత్ ఆడనుంది.

Tags:    

Similar News