CWC2023: ప్రపంచకప్‌లో అసలైన సమరం
న్యూజిలాండ్‌తో టీమిండియా ఢీ.... ఇప్పటివరకూ ఓటమి ఎరుగని ఇరు జట్లు;
ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా అసలైన పోరుకు సిద్ధమైంది. ఈ ప్రపంచకప్‌లో ఇంతవరకు ఓటమి ఎరుగని రెండు జట్లు మైదానంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న న్యూజిలాండ్‌తో రోహిత్ సేన ఢీ కొనబోతోంది. గాయం కారణంగా భారత జట్టుకు హార్దిక పాండ్యా దూరంకాగా న్యూజిలాండ్‌కు కెప్టెన్ విలియమ్సన్ దూరమయ్యాడు. పాండ్యా గాయం కారణంగా టీమిండియా సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని మాజీలు హెచ్చరిస్తున్నారు. పాండ్యా గాయం కారణంగా దూరమైతే ఈ ప్రపంచకప్‌లో తొలిసారి పేసర్ మహ్మద్ షమీ బరిలోకి దిగడం ఖాయం. ధర్మశాల పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందన్న అంచనాలతో షమీ తుది జట్టులోకి రావడం తథ్యం. ఒకవేళ బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేయాలని చూస్తే మాత్రం సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వస్తాడు. అయితే మ్యాచ్ రోజే తుది నిర్ణయం తీసుకుంటామని రోహిత్ వెల్లడించాడు. బంతితో బ్యాట్‌తో కూడా రాణించే రవిచంద్రన్ అశ్విన్ కూడా జట్టులోకి రావచ్చు.
భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. కోహ్లీ కూడా మంచి ఫామ్ అందిబుచ్చుకున్నాడు. బంగ్లాదేశ్‌పై సెంచరీ కూడా బాదాడు. కేఎల్ రాహుల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విలువైన స్కోర్ అందిస్తున్నాడు. రానున్న మ్యాచుల్లో వీరు రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. గిల్, శ్రేయస్,జడేజా కూడా రాణిస్తే కివీస్ బౌలర్లకు తిప్పలు తప్పవు. ఎలాగూ ఉండనే ఉన్నాడు. బౌలింగ్‌లో బుమ్రా,కుల్‌దీప్, జడేజా, కుల్‌దీప్ యాదవ్ ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తున్నారు. అయితే అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న కివీస్‌ను ఎదుర్కోవడం భారత్‌కు సవాలే. ఐసీసీ టోర్నీల్లో టీమ్‌ఇండియాపై న్యూజిలాండ్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి మంచి జోష్ మీదుంది. విల్ యంగ్, డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, లాథమ్, ఫిలిప్స్‌లతో ఆ జట్టు బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్‌లో మ్యాట్ హెన్రీ, శాంట్నర్, ఫెర్గూసన్ అదరగొడుతున్నారు. ప్రస్తుతం శాంట్నర్ 11 వికెట్లతో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్ , సూర్యకుమార్ యాదవ్.
న్యూజిలాండ్ జట్టు:
ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్( కెప్టెన్), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌధీ, విల్ యంగ్.