AI : ఏఐతో లాభపడేది సంపన్నులే..!

Update: 2024-05-22 07:03 GMT

చాట్ జీపీటీ అనేది టెక్ ప్రపంచంలో ఓ సంచలనం. ఓపెన్ఐ, కంపెనీ సీఈవో సాం ఆల్టిమిన్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆపై చాటిజీపీటీ ప్రాచుర్యం పొందడంతో పలు టెక్ దిగ్గజ కంపెనీలు తమ సొంత చాట్ బాట్లను లాంఛ్ చేశాయి. ఏఐతో నూతన అవకాశాలు ముందుకొస్తాయని, మానవులకు తమ దైనందిన జీవితంలో ఏఐ సాయపడుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఐతే.. ఏఐతో మనుషులు చేసే ఉద్యోగాలు కనుమరుగవు తాయని మరికొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గాడ్ ఫాదర్లలో ఒకరిగా చెబుతున్న జెఫ్రీ హింటన్ హాట్ కామెంట్ చేశారు. ఏడాదిగా ఆయన ఈ టెక్నాలజీ ప్రభావంపై రీసెర్చ్ చేస్తున్నారు. ఏఐతో మనుషులు చేసే ఉద్యోగాలు కనుమరుగవుతాయని అన్నారు. ఈ కొత్త టెక్నాలజీ ఉత్పాదకతను పెంచి సంపదను సృష్టించినా.. అది తిరిగి సంపన్నుల చేతికి చేరుతుందని ఆయన తన ఆవేదనను వెళ్లగక్కారు.

ఏఐతో సంపదను సమకూర్చినా అది ఈ టెక్నాలజీతో ఉద్యోగాలు కోల్పోయిన వారికి, సామాన్యు లకు అందకుండా పోతుందన్నారు జెఫ్రీ హింటన్. జనానికి ఆదాయం వచ్చే పథకంగా దీన్ని మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News