Finishing Touch to Campaigning : 48 గంటలు.. ప్రచారానికి లీడర్ల ఫినిషింగ్ టచ్
కొద్దివారాలుగా హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారానికి 48 గంటల్లో తెరపడనుంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన జరగనుంది. శనివారంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు తిరగని ప్రాంతాలను ఒకసారి రీషెడ్యూల్ చేసుకుంటున్నారు పార్టీల లీడర్లు. మార్చి 16వ తేదీన పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రంలో ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు. నామినేషన్ల దాఖలుకు 25వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగుతుంది. జూన్ 4వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నారు.
శనివారం సాయంత్రం 6 గంటల వరకే ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఎండల తీవ్రత కారణంగా ప్రచార సమయాన్ని, పోలింగ్ సమయాన్ని పొడిగించాలన్న రాజకీయ పార్టీల డిమాండ్ ను ఎన్నికల సంఘం అంగీకరించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంట వరకు ఓటు వేయవచ్చు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ సమయానికి 48 గంటల ముందు వరకే ప్రచారం నిర్వహించుకోవాలి. పోలింగ్ ఏర్పాట్లను కూడా ఈసీ కంప్లీట్ చేస్తోంది.