కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం జూన్ చివరివారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందులో రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు, నిధులు పరిశీలించే అవకాశం ఉంది. ఆ తర్వాతే పూర్తిస్థాయి బడ్జెట్ ను రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
జులై రెండు లేదా మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలనే యోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో కేటాయింపులు పక్కాగా ఉండాలని ఇప్పటికే అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.