Budget Allocation : రాష్ట్ర బడ్జెట్ లో మహిళలకు ఇచ్చింది గాడిద గుడ్డు

Update: 2024-07-26 15:31 GMT

రాష్ట్ర బడ్జెట్​లో మహిళలకు సరైన నిధులు కేటాయింపు జరగలేదంటూ శుక్రవారం బీజేపీ మహిళా మోర్చా నేతలు ట్యాంక్ బండ్​ అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు మహిళా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ బడ్జెట్​లో మహిళలకు ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప ఏమీ లేదన్నారు. ఆందోళన చేస్తున్న మహిళా మోర్చా నేతలను పోలీసులు అరెస్టు చేశారు.'ప్రతి మహిళకు రూ.2500, ప్రతి నెల రూ. 4వేల పెన్షన్, అమ్మాయిలకు స్కూటీ ఇస్తామని కాంగ్రెస్​ హామీలు ఇచ్చింది. మహిళల విషయంలో ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తున్నాం. హామీలు అమలు చేయకపోతే గాంధీ భవన్​తో పాటు సీఎం రేవంత్ ఇంటిని ముట్టడిస్తాం' అని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు -శిల్పారెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News