TS : నేడు బీఆర్‌ఎస్‌ వరంగల్‌ లోక్‌సభ స్థాయి సమావేశం

Update: 2024-04-01 05:25 GMT

బీఆర్‌ఎస్‌ పార్టీ (BRS Party) వరంగల్‌ (Warangal) లోక్‌సభ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం చింతగట్టు క్యాంపు సమీపంలోని కేఎల్‌ఎన్‌ పంక్షన్‌హాల్‌లో నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లా (Hanumakonda District) బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్‌ అధ్యక్షతన సోమవారం ఉదయం 11గంటలకు నిర్వహించే సమావేశానికి మాజీ మంత్రి టి.హరీష్‌రావు హాజరుకానున్నారు.

కడియం శ్రీహరి (Kadiyam Srihari), అరూరి రమేశ్‌ (Aruri Ramesh) బీఆర్‌ఎస్‌ను వీడాక నిర్వహిస్తున్న సమావేశంలో పలు అంశాలు చర్చకురానున్నాయి. లోక్‌సభ వరంగల్‌ అభ్యర్థిత్వం విషయంలో బీఆర్‌ఎస్‌ నేతలు, ఉద్యమకారులు పోటీపడుతున్న విషయం తెలిసిందే. సమావేశం అనంతరం అభ్యర్థి ఎంపిక విషయంలో జిల్లా నేతలు హరీష్‌రావుతో ప్రత్యేకంగా భేటీ అయి ఫైనల్‌ చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News