Padma Shri Awardees : పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్ ప్రైజ్ మనీ
పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులను అందజేశారు. సచివాలయంలో బుధవారం సాయంత్రం పద్మశ్రీ అవార్డును సాధించిన ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప వేలు ఆనందచారి, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్ సోంతాల్ చెక్కులను అందుకున్నారు. రూ.25 లక్షల చెక్కులను అందించిన సందర్భంగా ముఖ్యమంత్రికి అవార్డు గ్రహీతలు కృతజ్ఞతలు తెలిపారు.