CM Revanth Reddy : గొర్రెల పంపిణీ స్కీంలో రూ.700 కోట్ల అవినీతి : సీఎం రేవంత్‌రెడ్డి
బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందన్నారు. రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల భూములు అమ్మేశారని చెప్పారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీష్ రావు అమ్మకాల లెక్కలు చెప్పలేదని విమర్శించారు. ‘పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పదేళ్లలో పూర్తి చేయలేదు. లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్‌ను రూ.7కోట్లకు అమ్మేశారు. బతుకమ్మ చీరలు అని చెప్పి సూరత్ నుంచి కిలోల లెక్క తీసుకొచ్చి రాష్ట్రంలో పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ తీరువల్లే కేంద్ర బడ్జెట్‌లో ఒక్క పైసా రాలేదు. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, గొర్రెల స్కీమ్‌లో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్ నేతలు విచారణకు సిద్ధమా అని రేవంత్ సవాల్ విసిరారు.