రాబోయే 3 నెలల్లో మరో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ప్రకటన చేశారు. ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్టేట్ మెంట్ ఇచ్చారు. మరో 90రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే 60వేలకు పైగా ఉద్యోగాలు అందించి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పిస్తున్నామని ప్రకటన చేశారు.
సమస్యలను పరిష్కరించేందుకు మీ రేవంతన్నగా మీకు ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజా ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా విద్య, వైద్యానికి బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చామని.. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు జీతం అందించి ఉద్యోగులకు ప్రభుత్వం పై విశ్వాసం కల్పించామని తెలిపారు.
"ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ ముందుకెళతామని హామీ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులకు, విద్యార్థులకు నా సూచన ఒక్కటే. మీకు సమస్యలు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించాలని" కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.