TS : రైతు భరోసా నిధులు మొత్తం విడుదల చేశాం: రేవంత్

Update: 2024-05-10 06:02 GMT

రైతు భరోసా నిధులు మొత్తం విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 69 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించామని చెప్పారు. ‘మహిళల ఫ్రీ జర్నీకి నెలకు రూ.350 కోట్లు ఖర్చవుతోంది. 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. కేసీఆర్ దగ్గర కుర్చీ లాక్కున్నా.. ఆయన దగ్గర ఇంకేం లేదు. నా జోలికి ఎవరైనా వస్తే ఊరుకునే వ్యక్తిని కాదు. ఒక చెంపపై కొడితే రెండు చెంపలు వాయిస్తా’ అని ఆయన పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ వివరాలు అసెంబ్లీలో వెల్లడిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఫోన్ ట్యాపింగ్ విషయాలు ప్రస్తుతం బయట మాట్లాడలేను. ఒకవేళ మాట్లాడితే కేసు విచారణపై ప్రభావం చూపుతుంది. ఎవరు ఏ ఉద్దేశంతో ట్యాపింగ్ చేశారో తెలియాల్సి ఉంది. ఇందులో సూత్రధారులు ఎవరో? పాత్రధారులు ఎవరో? తేలాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పొలిటికల్ ట్యాపింగ్ చేయదు’ అని ఆయన స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ, అమిత్ షాపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ‘తెలంగాణ పరిస్థితులు, విధానాన్ని దెబ్బతీసేందుకు గుజరాత్ పెట్టుబడిదారులు కుట్ర చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గ్యారంటీ లేదనే వాతావరణాన్ని సృష్టించి.. వాటిని గుజరాత్‌కు తరలించేందుకు మోదీ, అమిత్ షా కుట్రకు పాల్పడుతున్నారు. TG ఆకాంక్షలను, అభివృద్ధిని, ఆలోచనలను అడ్డుకుంటున్నారు’ అని ఆరోపించారు.

Tags:    

Similar News