యాదాద్రిలో బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. అక్కడ టెంపుల్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ(YTDA) పూర్తి స్టేటస్ రిపోర్టు తనకు అందించాలన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ టూరిజం పాలసీలను అధ్యయనం చేసి కొత్త పాలసీని రూపొందించాలని ఆదేశించారు. హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజంపై దృష్టి పెట్టాలన్నారు. యాదాద్రిలో భక్తుల సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టమైన వివరాలు అందించాలని ఆదేశించారు.యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధంతరంగా వదిలేయడానికి వీళ్లేదని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని సీఎం సూచించారు.