టీజీఎస్‌ఆర్టీసీ పనితీరుపై ఆ సంస్థ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా... మహిళలకు ఉచిత రవాణా(మహాలక్ష్మీ) పఽథకం అమలవుతోన్న తీరును, ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనను ఆయన తెలుసుకోనున్నారు. కాగా రెండు రోజులుగా జోన్‌ల వారీగా టీజీఎస్‌ఆర్టీసీ డిపో మేనేజర్లతో వేర్వేరుగా సమావేశమైన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ.సజ్జనార్... బస్సుల నిర్వహణ, క్షేత్రస్థాయిలోని సమస్యలపై సమీక్షించారు.
రాష్ట్రవ్యాప్తంగా 9035 బస్సుల్లో 70 శాతం వరకు ఉన్న పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని టీజీఎస్ ఆర్టీసీ అమలు చేస్తోంది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు బాండ్స్ బకాయిల చెల్లింపులకు రూ.80 కోట్లు విడుదల చేసింది. అలాగే సీసీఎస్‌కు రూ.150కోట్లు నిధులు సమకూర్చింది. అలాగే బ్యాంకుల ద్వారా మరో రూ.150కోట్లు సీసీఎస్‌కు అందించింది.