TG : చెల్లె జైల్లో ఉంటే బజారులో రాజకీయం చేసేటోణ్ని కాను.. సీఎం హాట్ కామెంట్స్

Update: 2024-08-02 07:05 GMT

దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు భగ్నం చేసినట్లు బీఆర్ఎస్ చేస్తోందని... ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన మాదిగలను నిర్లక్ష్యం చేయడం తగదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏళ్ల కొద్దీ వర్గీకరణ అంశం సాగొద్దని.. ఏదేమైనా కేసు పూర్తికావాలని అవసరమైన చర్చలన్నీ తీసుకున్నామన్నారు. వీళ్లను కాపాడే బాధ్యత మాదేనని, ఉద్దండులైన న్యాయవాదులను పెట్టామన్నారు.

'ఈ అధికారం వాళ్లిచ్చిందే.. ఆ దళిత జాతి బిడ్డలు ఓట్లేయనిదే నేను సీఎం కాలేదు.. వారి ఓట్లు లేకుండా మీరు ఎమ్మెల్యేలు అయ్యారా...? అని ప్రశ్నించారు. విజ్ఞత ప్రదర్శిస్తే ఆ వర్గాలకు మీరే పెద్దక్కలు అవుతారు. చెడును పదిచ్చి వదిలేయాలి. మంచిని పదిచ్చి కొనుక్కోవాలి.. నేను కిందిస్థాయి నుంచి వచ్చిన.. నాకూ అక్కలు ఉన్నారు. చెల్లెలు జైల్లో ఉంటే రాజకీయం చేసేంత నీచమైన జాతి నాదికాదు. మాదిగ సోదరులను ఆదుకుంటాం... నేడు వారికి పండుగ రోజు... ఇంకా వారిని అణచాలని చూస్తే ఆ జాతి మిమ్మల్ని క్షమించదు' అని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చురకలు వేశారు.

అక్కలను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దళితుడిని జాతీయ అధ్యక్షుడిని చేసిన చరిత్ర కాంగ్రెస్ దని, దళితుడైన స్పీకర్ ముందు కింద కూర్చోవడం ఇష్టం లేకనే కేసీఆర్ సభకు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దళిత బిడ్డను అధ్యక్ష అని అనడం ఇష్టం లేకే కేసీఆర్ సభకు రాలేదన్నారు. ఆయన, ఆయన వారసుల్లో దొరతనం పోకడలు పోలేదన్నారు.

Tags:    

Similar News