CM Revanth Reddy : అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి

Update: 2024-07-19 10:40 GMT

సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు 3న హైదరాబాద్ నుంచి అమెరికాకు సీఎం బృందం బయలుదేరనుంది. వారం రోజుల పాటు అమెరికాలోనే పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకట్టుకునే లక్ష్యంగా ప్రత్యేకించి ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. డల్లాస్‌తో పాటు పలు రాష్ట్రాల్లో పర్యటన ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను ఆయన ఈ సందర్భంగా కలిసి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. వారం రోజుల పాటు పర్యటించనున్న రేవంత్ తిరిగి ఆగస్టు 11న హైదరాబాద్ కు చేరుకుంటారని తెలిసింది.

Tags:    

Similar News