Feroz Khan : ఎంఐఎం ఐటెం గర్ల్స్ లాంటిది : ఫిరోజ్ ఖాన్

Update: 2024-08-09 09:00 GMT

ఎంఐఎంపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ( Feroz Khan ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీ ఐటెం గర్ల్స్ లాంటిదని.. దాన్ని ఎవరూ సీరియస్ తీసుకోరని విమర్శించారు. ఓవైసీ బ్రదర్స్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సంకలో ఎక్కుతారని తీవ్ర విమర్శలు చేశారు. ఊసరవెల్లి చెట్టు ఎక్కితేనో, రాయి ఎక్కితేనో రంగు మారుద్ది కానీ ఈ అన్నదమ్ములు చెట్టును, రాయిని చూస్తేనే రంగు మారుస్తారని ఆరోపించారు.‘గత పదేళ్లుగా కేసీఆర్ మా దోస్త్ అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మా ఫ్రెండ్ అంటూ రేవంత్ ఒళ్ళో కూర్చుంటున్నారు. వీళ్లు ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకి ఫ్రెండ్స్ అవుతారంటూ మండిపడ్డారు.

Tags:    

Similar News