Budget Issues : బడ్జెట్ మంటలు.. నీతి ఆయోగ్ మీటింగ్‌కు తెలంగాణ సహా పలు రాష్ట్రాలు దూరం
ప్రతిపక్ష రాష్ట్రాల పట్ల బడ్జెట్ లో వివక్ష ప్రదర్శించారని విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరిస్తారని ప్రకటించింది.
వీరితో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ బడ్జెట్ వివక్షాపూరితం, ప్రమాదకరమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సుఖు హాజరు కావడంలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, బుధవారంనాడు వెల్లడించారు.
కేంద్ర బడ్జెట్ సమాఖ్య సూత్రాలకు విరుద్ధంగా కేటాయింపులు ఉన్నాయని ఆయన విమర్శించారు.