తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ ‘మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం’కి ఎంపికయ్యారు. శ్రీకృష్ణదేవరాయ తెలుగు బాషా నిలయం ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. ఈ ఏడాదికి గాను అందెశ్రీని ఎంపిక చేసింది. మరోవైపు తెలంగాణ సారస్వత పరిషత్తు ఏటా ప్రదానం చేసే డాక్టర్ సి.నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారానికి ప్రముఖ కవి డా.యాకూబ్ ఎంపికయ్యారు. ఈ నెల 27న సాయంత్రం హైదరాబాద్ బొగ్గులకుంటలోని సారస్వత పరిషత్తు ప్రాంగణంలో సి.నారాయణరెడ్డి జయంతి వేడుకల్లో పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.