Excise Officials : నాటుసారా తయారీ కేంద్రాలపై.. ఎక్సైజ్ అధికారుల దాడులు

Update: 2024-05-08 05:56 GMT

నియోజకవర్గ పరిధిలో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం హుజూర్ నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జిన్నా నాగార్జునరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మటంపల్లి మండలం కొత్తదొనబండ తండాకు చెందిన బానోత్ బాలు తన టూ వీలర్ పై నాటుసారా తరలిస్తుండగా అతడిని అరెస్ట్ చేసి 8 లీటర్ల సారాతోపాటు బైక్ ను సీజ్ చేశారు. మేళ్లచెర్వు మండలం వెల్లటూ రు కాలనీకి చెందిన దాసు నర్సమ్మటీవీఎస్ పై 8 పై 8 లీటర్ల సారా తరలిస్తుండగా ఆమెను అదుపులో కి తీసుకొని సారా, టూ వీలర్ ను సీజ్ చేశారు.

సాధు తండాకు చెందిన ధరావత్ంగ, ధరావత్ రంగమ్మహోండా షైన్ పై 5 లీటర్ల సారా, 50 కేజీల బెల్లం తరలిస్తుండగా ఇద్దరిని అరెస్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేశారు. పలు కేసుల్లో 22 మంది అరెస్ట్ చేసి బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడుల్లో ఎస్ ఐలు జగన్మోహన్ రెడ్డి, దివ్య, వెన్నెల, గోవర్ధన్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

నియోజకవర్గంలోని డిండి, చందంపేట, నేరేడుగుమ్ము మండలాల్లో నిపలు గ్రామాల్లో మంగళవారం ఎక్సైజ్ అధికా రులు దాడులు నిర్వహించారు. నల్గొండ టీమ్, డీటీఎఫ్ నల్గొండ, నాంపల్లి స్థానిక పోలీసులతో కలిసి పడమటిపల్లి తండా, పాత్లావత్ తండా, మే గ్యతండా, దేవర తండా, కుందుకూరు పరిధిలో దాడులు చేశారు. ఐదుగురిని అరెస్టు చేసి 46 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. 1100 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు.

Tags:    

Similar News