TS : వడదెబ్బకు ఇద్దరు మృతి.. ఇవాళ, రేపు ఎండలు మరింత తీవ్రం

Update: 2024-04-29 06:26 GMT

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. నిన్న ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో వడదెబ్బతో ఇద్దరు మరణించారు. మరోవైపు ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో వర్షం పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.

రేపు 47 మండలాల్లో తీవ్ర వడగాలులు, 151 మండలాల్లో వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఎల్లుండి 61 మండలాల్లో తీవ్ర వడగాలులు, 159 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఇవాళ 68 మండలాల్లో తీవ్ర వడగాలులు,120 మండలాల్లో వడగాలులు వీచాయని పేర్కొంది. ప్రజలు ఉ.11 నుంచి సా.4 వరకు ఇంట్లోనే ఉండాలని, ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించింది.

మరోవైపు భానుడి ప్రతాపం కొనసాగుతోంది. నిన్న పలు చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు, వైఎస్ఆర్ కడప జిల్లా చాపాడులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు 47 మండలాల్లో తీవ్ర వడగాలులు, 151 మండలాల్లో వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు వీలైనంత వరకు నీడపట్టునే ఉండాలని సూచించింది.

Tags:    

Similar News