Rain Alerts: మూడు రోజుల పాటు వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర వెల్లడించింది.

Update: 2021-08-16 04:13 GMT

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఉప‌రి‌తల ఆవ‌ర్తనం, ఉప‌రి‌తల ద్రోణి ప్రభా‌వంతో తూర్పు, ఈశాన్య, ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది.

తెలంగాణలోని పెద్దపల్లి, సూర్యా‌పేట, మహ‌బూ‌బా‌బాద్‌, జయ‌శం‌కర్‌ భూపా‌ల‌పల్లి, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరం‌గల్‌, కరీంన‌గర్‌, హన్మకొండ జిల్లాల్లో, 17, 18న పలు పలు‌ప్రాం‌తాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల పడే అవకాశముందని చెప్పింది. ఇదిలా ఉండగా సోమవారం వేకువ జాము నుంచి పలు జిల్లాల్లో భారీ, మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌ నగరంలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి.

ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అదే విధంగా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపారు. గుంటూరు, కృష్ణ జిల్లాలతో పాటు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Tags:    

Similar News