Dengue : 8 నెలల్లో 5,372 మందికి డెంగ్యూ... హైదరాబాద్ టాప్

Update: 2024-08-27 15:30 GMT

రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 5,372 మంది డెంగ్యూ బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 81,932 నమూనాలను పరీక్షించగా.. అందులో 6.5శాతం పాజిటివ్‌గా తేలినట్లు ప్రకటించింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 1,852 మందికి డెంగ్యూ సోకగా.. సూర్యాపేటలో 471, మేడ్చల్‌లో 426, ఖమ్మంలో 375, నల్గొండలో 315, నిజామాబాద్‌లో 286, రంగారెడ్డిలో 232, జగిత్యాలలో 185, సంగారెడ్డిలో 160, వరంగల్‌లో 110 కేసులు నమోదయ్యాయి. మరోవైపు, 152 మందికి చికున్‌ గున్యా, 191 మందికి మలేరియా సోకినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. జులైలో ఫీవర్‌ సర్వే చేపట్టిన ఆరోగ్యశాఖ... ఇప్పటి వరకు 1,42,78,723 హౌస్‌ హోల్డ్స్‌లో సర్వే చేసినట్లు పేర్కొంది.

Tags:    

Similar News