తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కార్పోరేషన్ (టీఎస్ఐఐసీ) చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి సతీ మణి తూర్పు నిర్మల జగ్గారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. బషీర్ బాగ్ చౌర స్త్రీలోని పరిశ్రమల భవన్లో బాధ్యతలు స్వీకరించారు.
ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న నిర్మల జగ్గారెడ్డి తన భర్తకు రాజకీయాల్లో తోడుగా ఉండేందుకు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరారు. ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.