TS : ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌కు జేడీ లక్ష్మీనారాయణ సపోర్ట్

Update: 2024-05-23 09:04 GMT

తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన నల్గొండ- వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఉప ఎన్నికలో తన మద్దతును బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ కు ఇస్తున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక ప్రకటన చేశారు.

బుధవారం ఆయన ఒక వీడియోను జేడీ విడుదల చేశారు. ఉన్నత విద్యావంతులు, యువకులు, నిజాయితీపరులు రాజకీయాల్లోకి రావాలని, అలాంటివారిని ఆశీర్వదించాలని గ్రాడ్యుయేట్లకు సూచించారు. అందరికి సుపరిచితుడైన రాకేష్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని అందులో కోరారు. రాకేశ్ రెడ్డి సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి బిట్స్ పిలాని చదివారని, గోల్డ్ మెడల్ సాధించారని, కోట్లు సంపాదించే కొలువులను వదిలి ప్రజా సేవ కోసం వచ్చారని చెప్పారు లక్ష్మీనారాయణ. అలాంటి నిజాయితీ పరుడికి అండగా నిలవాలని పట్టభద్రులను అభ్యర్ధించారు. ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో ఏనుగుల రాకేశ్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags:    

Similar News