బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మెడికట్ టెస్టుల కోసం గురువారం కేసీఆర్ యశోద ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. వైద్య పరీక్షల తర్వాత డాక్టర్లు డిశ్చార్జ్ చేయడంతో ఆయన నందినగర్‌లోని తన నివాసానికి వెళ్లారు. వారం రోజుల క్రితం కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. దాంతో కుటుంబసభ్యులు ఆయన్ని యశోద ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు షుగర్ లెవల్స్ ఎక్కువగా.. సోడియం లెవల్స్ తక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రెండు రోజుల పాటు చికిత్స తర్వాత అవి నియంత్రణలోకి రావడంతో కేసీఆర్ ను డిశ్చార్జి చేశారు. అప్పటి నుంచి ఆయన నందినగర్ లోని నివాసంలోనే ఉంటున్నారు. ఆరోగ్యం సెట్ కావడంతో మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయన గురువారం మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా.. మెడికల్ టెస్టుల తర్వాత వైద్యులు డిశ్చార్జి చేశారు.