కేటీఆర్‌పై మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మూసీ ప్రక్షాళన కోసం కేటాయించిన బడ్జెట్‌లో సీఎం రేవంత్ రెడ్డి కొంత డబ్బు ఢిల్లీ హైకమాండ్‌కు పంపుతున్నారని కేటీఆర్ ఆరోపించడాన్ని తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలతో కేటీఆర్ మానసిక స్థితి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వనస్థలిపురం ప్రశాంత్ నగర్‌లోని కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కేటీఆర్, హరీష్ రావులకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. మూసీ ప్రక్షాళన కేవలం ప్రజలు ఎలాంటి అనారోగ్యాలకు గురికాకుండా ఉండటానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారనీ, రానున్న దసరా వరకు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలోకి తేవడం జరుగుతుందని తెలిపారు.