TG : మనం తన్నుకుంటే మరొకడు వస్తాడు.. కొండా సురేఖ

Update: 2024-06-13 08:35 GMT

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండాసురేఖ ( Konda Surekha ) వరంగల్ కేడర్ కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రతిఒక్కరూ కృషిచేయాలని కొండా సురేఖ అన్నారు. ఇందిరమ్మ కమిటీల ఆధ్వ ర్యంలో నిష్పక్షపాతంగా, అవినీతి రహితంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూడాలన్నారు.

వరంగల్ పార్లమెంట్ సభ్యు రాలిగా డాక్టర్ కడియం కావ్య గెలిచిన సందర్భంగా హను మకొండ జిల్లా సత్యసాయి కన్వెన్షన్లో బుధ వారం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్. నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మేయర్ గుండు సుధా రాణిలతో కలిసి మంత్రి సురేఖ పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా ఏమిటో చూపించామని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలను సాధించాలని కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఘన్పూర్ నియోజకవర్గంలో గ్రూపులు లేవని, ఎవరైనా గ్రూపులు అంటే తోక కత్తిరించడమేనని హెచ్చరించారు.

పార్లమెంట్లో విభజన చట్టం హామీల అమలు కోసం తెలంగాణ ఎంపీలతో కలిసి పాలక ప్ర భుత్వాన్ని నిలదీసి వచ్చే విధంగా శక్తివంచనలేకుండా కృషిచేస్తానన్నారు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య. తన తండ్రిపేరు నిలబెట్టేవిధంగా ఎక్కడా తలవంపులు లేకుండా పనిచేస్తానన్నారు.

Tags:    

Similar News