TG : కేసీఆర్‌ను కేటీఆర్ బొండిగె పిసికి చంపిండేమో..? కొండా సురేఖ మరో కాంట్రవర్సీ

Update: 2024-10-04 07:45 GMT

పదవీకాంక్షతో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేసీఆర్ ను ఏం చేశారో నంటూ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కన్పించకపోవడం వల్లే ఆ అనుమానం వస్తోందని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ ను గొంతు(బొండిగె) పిసికి కేటీఆర్ చంపేసిండేమో అని అనుమానం వ్యక్తంచేశారు కొండా సురేఖ. గురువారం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరేందర్రెడ్డి, ఉపాధ్యక్షులుగా సర్దార్ ఖాన్, పాలక వర్గ సభ్యులు ప్రమాణ స్వీకారానికి మంత్రి కొండా సురేఖ హాజరై మాట్లాడారు.

బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలతోనే కవితకు పార్లమెంట్ ఎన్నికలు కాగానే బెయిల్ వచ్చింద న్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలవకపోయిన పర్లేదు కానీ బీజేపీ గెలవాలనే లక్ష్యంతో 7 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చి గెలిపించిందన్నారు. మెదక్ పార్లమెంట్ స్థానంలో నీలం మధు స్వల్ప మెజార్టీతో ఓడిపోయారని, గజ్వేల్, సిద్దిపేటలో క్రాస్ ఓటింగ్ వల్లే ఇక్కడ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై హైడ్రా, మూసీ ప్రక్షాళనతో ప్రజల్లో అపోహలు లేపి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోమన్నారు. కాగా తల తాకట్టు పెట్టిన రైతాంగానికి అండగా ఉంటామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనిరాష్ట్ర వ్యవసాయాశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. త్వరలోనే 2లక్షల రుణ మాఫీని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతాంగానికి ఇబ్బంది రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

Tags:    

Similar News