అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ కు కేటాయించిన ఛాంబర్ పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సమావేశాల సందర్భంగా ఇన్నర్ లాబీలోని ఎల్ఓపీ కార్యాలయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తొలగించారు. ఔటర్ లాబీలో ఎల్వోపీకి ఛాంబర్ ఏర్పాటు చేశారు.
రెండు రూమ్ లు కలిపి ఒకే రూమ్ గా అసెంబ్లీ సిబ్బంది మార్చేశారు. అయితే రూమ్ మధ్యలో టాయిలెట్ పెట్టి వాడుకోవడానికి అనుకూలంగా లేకుండా చేశారని కేటీఆర్ మండిపడ్డారు. దీనిపై ప్రొటెస్ట్ చేయనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.