Liquor Shops : మద్యం దుకాణాల బంద్.. ఎప్పుడు ఓపెన్ అంటే..

Update: 2024-04-17 07:06 GMT

శ్రీరామ నవమి సందర్భంగా ఆలయాలు, శాభా యాత్రల్లో భక్తులు నిమగ్నమై ఉన్నారు. హైదరాబాద్ లో శోభాయాత్ర సందడి కనిపిస్తోంది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పోలీసులు... పలు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ లో మద్యం దుకాణాలను బంద్ చేశారు.

ఏప్రిల్ 17 బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి మరునాడు గురువారం ఉదయం ఆరు గంటల వరకూ వైన్ షాపులు బంద్ ఉంటాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నగర పోలీసు కమిషన్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నిబంధనలను అందరూ పాటించాలని కోరారు.

పోలీసు ఆంక్షలు కాదని.. ఎవరైనా షాపులు తెరిచి ఉంచినా, మద్యాన్ని అమ్మినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిటీ పోలీస్ కమిషనర్లు హెచ్చరించారు. దీంతో.. నవమి రోజు నగరంలోని అన్ని వైన్ షాపులు బంద్ కానున్నాయి.

Tags:    

Similar News