హైదరాబాద్‌లోని రాంనగర్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ చీరల షాపులో అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. మంటలు దుకాణమంతా వ్యాపిస్తున్నాయి. చీరల దుకాణం పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా కమ్ముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించింది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఆ షాపులో పని చేసే సిబ్బంది ఎవరైనా గాయపడ్డారా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది.